విజయ్‌ దేవరకొండ విడుదల చేసిన ఆ ట్రైలర్‌ చూశారా?

‘రాజా వారు రాణి గారు’, ‘SR క‌ళ్యాణ‌మండ‌పం’ సినిమాలతో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ‘SR క‌ళ్యాణ‌మండ‌పం’ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ హీరో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సెబాస్టియ‌న్ పీసీ 524’ . బాలాజీ సయ్యపురెడ్డి దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండతో విడుదల చేయించింది చిత్ర బృందం.

సినిమా ట్రైలర్ చూస్తే… నైట్ డ్యూటీస్ నుంచి తప్పించుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు, డ్యూటీలో ఉన్న సమయంలో స్టేష‌న్‌లో లైట్స్ ఆపేసి చీకటిగా ఉంచడం వంటివి నవ్వించేలా ఉన్నాయి. హీరోయిన్ నువేక్షతో రొమాంటిక్ సీన్, లిప్ లాక్ కూడా చూపించారు. అయితే… మదనపల్లి పాత పట్నంలో మర్డర్ జరగడం, ఆ తర్వాత సెబాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం వంటివి చూపించడం ద్వారా కథపై ఆసక్తి కలిగించారు. ట్రైలర్ మొత్తం మీద ‘పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళేది పోలీస్ స్టేషన్ కే. పోస్ట్ ఆఫీస్ కి కాదు’ అని హీరో కిరణ్ అబ్బవరం, ‘నాకు పగులు పూట డ్యూటీలు వేయండి సార్’ అని హీరో అడిగితే… ‘ఇదేమైనా సాఫ్ట్‌వేర్ ఆఫీసా? డే షిఫ్ట్ చేస్తా, నైట్ షిఫ్ట్ చేయను అనడానికి!?’ అని శ్రీకాంత్ అయ్యంగార్ రిప్లై ఇవ్వడం హైలైట్.

https://twitter.com/TheDeverakonda/status/1498169620145917953?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1498169620145917953%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fsebastianpc524-movie-trailer-kiran-abbavaram-komali-prasad-nuveksha-starrer-sebastian-movie-promises-an-entertaining-thriller-24133

ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్‌, నమ్రతా దరేకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించగా.. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ మార్చి 4న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఫిబ్రవరి 28న రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయించారు మేకర్స్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *