సమంతకు అండగా నిలిచిన బాలీవుడ్‌ హీరో.. వీడియో వైరల్‌

విడాకుల అనంతరం వరుస సినిమాలు, వెకేషన్లతో ఫుల్‌ ఫామ్‌లో ఉంది సమంత. అటు టాలీవుడ్‌, ఇటు బాలీవడ్‌లోనూ చకా చకా ప్రాజెక్టులకు ఓకే చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల ఆమె ముంబయిలో ఎక్కువగా దర్శనమిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్‌లకు సంబంధించి పలువురు దర్శకులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్‌ అండ్‌ డీకేలను సమంత కలిశారు. ‘ఫ్యామిలీమేన్‌-2’ సిరీస్‌తో తనకు మంచి గుర్తింపు ఇచ్చిన వీరిద్దరిని కలిసి మాట్లాడారు. అయితే ఈ మీటింగ్‌లో సమంతతోపాటు బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ కూడా పాల్గొన్నారు.

samantha meets bollywood directors raj&Dk with varun dhavan

సమావేశం అనంతరం సమంత బయటకి రాగానే.. ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్‌ ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఎగబడ్డారు. ఇంతలో కొంత మంది సమంత సమంత అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో అక్కడే ఉన్న వరుణ్‌..‘‘సమంత భయపడిపోతుంది.. ఆమెను ఎందుకు భయపెడుతున్నారు’’ అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లి దగ్గరుండి కారు ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు వరుణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం సమంత, వరుణ్‌ ధావణ్ కలసి రాజ్‌ అండ్‌ డీకే, రూసో బ్రదర్స్‌ రూపొందిస్తున్న ‘సిటాడెల్‌’ అనే సిరీస్‌లో చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించి అఫీషియల్‌ సమాచారం అయితే లేదు. మరోవైపు సమంత ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో ‘శాకుంతలం’, తమిళ– తెలుగులో ‘కాథువాకుల రెండు కాకుల్‌’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ‘యశోద’ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *