సాయి ధరమ్ తేజ్ సినిమా.. నిర్మాతగా పవన్!

Sai Dharam Tej And Pawan kalyan: తెలుగు ప్రపంచానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అతి తక్కువ సమయంలో స్టార్ హోదా తెచ్చుకున్న హీరో పవన్. తన సరసన నటించడానికి ఏ నటి అయినా ఒక అడుగు ముందే ఉండాల్సిందే. ఇక పవన్ ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒకడిగా వెలుగుతున్నాడు.

Sai Dharam Tej And Pawan kalyan
Sai Dharam Tej And Pawan kalyan

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాకి పవన్ నిర్మాత మాత్రమే అనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ క్రమంలో తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు పవన్ రీమేక్ చేయాలనుకుంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే.. ‘వినోదయ సైతం’. ఈ చిత్రం నేరుగా ఓటీటీ రూపంలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఇదే సాయి ధరమ్ తేజ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాకుండా సినిమాకు పవన్ నిర్మాతగా మాత్రమే బాధ్యతలు చేపడతారని, సాయి ధరమ్ తేజ్ హీరోగా మెప్పించబోతున్నాడని పుకార్లు ఇప్పుడు షికార్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా ఏదైనా అప్డేట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *