దీప్తి, షన్నుల బ్రేకప్ ఇష్యూలో వేలుపెట్టిన శ్రీరెడ్డి.. ఏకంగా ఆ పర్సన్ పేరు లాగుతూ!

బిగ్ బాస్ షో అనేది కొందరి జీవితాలకు కొత్తదారి చూపిస్తే మరి కొన్ని జీవితాలకు చెరిగిపోని మచ్చలను మిగిలిస్తుంది. అందులో షణ్ముఖ్ ఒకడని చెప్పవచ్చు. ఇందులో షన్ను మరో కంటెస్టెంట్ సిరితో మితిమీరి ప్రవర్తించడంతో బయట నెగెటివిటీని సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా తనను ప్రాణంగా ప్రేమించిన దీప్తిని కూడా మిస్ చేసుకున్నాడు.

మొత్తానికి దీప్తి, షన్నుల మధ్య బ్రేక్ అప్ జరిగింది. దీంతో ప్రస్తుతం నెట్టింట్లో ఈ విషయం గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. అందులో తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా వీళ్ళ బ్రేకప్ ఇష్యూలో వేళ్ళు పెట్టింది. గతంలో దీప్తి కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని అందులో నటుడు తనిష్ తో ఎంత క్లోజ్ గా ఉందో చూశాం.

అంతేకానీ అతడితో సిరి లాగా ప్రవర్తించలేదు దీప్తి. కానీ ఈ విషయాన్ని శ్రీ రెడ్డి లాగుతూ.. దీప్తి కి వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరూ విడిపోవడం హాట్ టాపిక్ అవుతుందని.. వీరిద్దరూ చాలా క్యూట్ అని, చూడచక్కని జంట అని తెలిపింది. అలాంటిది వీళ్ళు బ్రేకప్ చెప్పుకోవడంతో తనను కలచివేసిందని అన్నది.

మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజమని అంటూ.. మరి తనిష్ తో ఉన్న విధానం చూస్తే అందరికీ లవ్ అని అనుమానం వచ్చేలా చేశావని అప్పుడు తప్ప అనిపించలేదా అంటూ ప్రశ్నించింది. ఒకవేళ షన్నుతో పెళ్లి అయి ఉంటే ఇలాగే చేసేదానివా అంటూ తప్పును సరిదిద్దుకోవాలి.. క్షమించుకోవాలని కొన్ని వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *