ప్రమోషన్స్‌ మోత మోగిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టీమ్‌..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేనియా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎవరిని కదిలించినా ‘ఆర్ఆర్ఆర్’ మంత్రం వినిపిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ మోత మోగిస్తుంది. రోజుకో నగరం తిరుగుతూ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. శుక్రవారం దుబాయ్‌లో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ పూర్తిచేసిన ఆర్ఆర్ఆర్ టీం.. శనివారం కర్ణాటకలో నిర్వహించింది.

RRR movie team pramotions

ఇక ఆదివారం బరోడా (గుజరాత్‌), ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆర్ఆర్ఆర్ యూనిట్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి కర్ణాటక నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్‌లోని ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ ముగ్గరు సందడి చేశారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అక్కడ ఫోటోలు దిగారు. ముఖ్యంగా తారక్‌, చెర్రీల దోస్థానం అందరిని ఆకట్టుకుంది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

శనివారం చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం బస్వరాజ్‌ బొమ్మై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి సినిమా మేకర్‌ కాదని, ఆయనొక క్రియేటర్‌ అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశం గర్వించదగ్గ చిత్రమవుతుందన్నారు. ప్రాంతీయ భాషలన్నీ అక్కాచెల్లెళ్లలాంటివని పేర్కొన్నారు. కన్నడ హీరో.. పునీత్‌ అన్న, నటుడు శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘నేను రాజమౌళికి పెద్ద ఫ్యాన్‌ను. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, చిరంజీవి, అజిత్‌, విజయ్‌లా ప్రతి ఒక్కరి సినిమా మొదటి రోజు టికెట్‌ కొనుక్కొని మరీ ఒక అభిమానిలా చూస్తా. భారతీయ సినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ పెంచింది. తెలుగు చిత్ర పరిశ్రమ నా కుటుంబం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం కోట్లమంది ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నా”అని అన్నారు. ఇక శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్‌ బాగా అరుపులు, కేకలు వేస్తూ.. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో దర్శకుడు రాజమౌళి ఫ్యాన్స్‌పై కాస్త సీరియస్‌ అయ్యారు. మైక్‌ తీసుకుని.. మార్షల్స్‌, డాన్సర్లను స్టేజీ దిగి.. పోవాలని హెచ్చరించాడు. అటు ఫ్యాన్స్‌ కు కూడా స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. వీటికి సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

https://youtu.be/yy3bfya06Ns

Add a Comment

Your email address will not be published. Required fields are marked *