ఫుల్ చిల్ అవుతున్న రౌడీ బాయ్స్ టీమ్!

ఇటీవలే విడుదలైన ‘రౌడీ బాయ్స్’ సినిమాకు దగ్గరుండి దిల్ రాజ్ బాధ్యతలు చేపట్టాడు. ఎట్టకేలకు ఈ సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు. కాగా ఈ సినిమాకు శ్రీ హర్ష కానుగంటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, ఆశిష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సాహిదేవ్, విక్రమ్, కార్తీక్ రత్నం కోమలి ప్రసాద్ లు ప్రధాన పాత్రలు చేశారు.

ఇక దిల్ రాజ్ తన తమ్ముడు అయిన శిరీష్ వారసుడు ఆశిష్ ను తెర మీదకు తీసుకొచ్చేందుకు దిల్ రాజ్ బాగానే కష్టపడ్డాడు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల అందరని సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇన్వైట్ చేసాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి పలు టాప్ హీరోలతో ప్రమోషన్లు చేయించాడు. కానీ చూస్తుంటే ఈ సినిమా ఘోరమైన పరాజయాన్ని చవి చూసేలా ఉంది.

నెటిజనులు ఈ సినిమాను చూసి తెగ చెవులు కొరుక్కుంటున్నారు. అనుపమ లిప్ లాక్ సీన్ తప్ప ఆ సినిమాలో మాకు టేస్ట్ ఏమీ దొరకలేదు అని అంటున్నారు. చూస్తుంటే దిల్ రాజ్ ఘోరమైన ఫ్లాప్ ను తన ఖాతాలో నింపుకున్నట్టు తెలుస్తుంది. అటు అశోక్ గల్లా సినిమా, ఇటు రౌడీ బాయ్స్ రెండు.. ఘోరమైన పరాజయాలు వాటి ఖాతాలో నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏదైనా సినిమాకు ఇలా అన్ని చోట్ల నెగిటివ్ టాక్ నడుస్తుంది. కానీ నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్ర బృందం ఫుల్ చిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెగిటివ్ టాక్ ని పక్కనపెట్టి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ ను దిల్ రాజు, ఆశిష్, అనుపమ అందరూ కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *