రామ్‌తో రొమాన్స్‌ చేయనున్న రష్మిక?

‘అఖండ’ భారీ విజయంతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ఇపుడు యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో యంగ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌తో ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ న్యూస్ ప్ర‌క‌టించ‌డంతో సినీ ల‌వ‌ర్స్ ఎగ్జైట్‌ ఫీల్‌ అవుతున్నారు. ఆ సినిమా పనులు కూడా ప్రారంభించారు. హీరోయిన్, ఇతర నటీనటుల సెలక్షన్ ప్రక్రియ మొదలైందని తెలిసింది. కాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త గాసిప్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చక్క‌ర్లు కొడుతోంది.

rashmika said yes to ram and boyapati's pan india movie?

రామ్‌కు జోడీగా రష్మిక అయితే బావుంటుందని బోయపాటి శ్రీను భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని, నితిన్, శర్వాలతో రష్మిక నటించారు. ఇప్పటివరకూ రామ్ సరసన నటించలేదు. సో… వీళ్ళిద్దరి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని, పైగా సినిమాలో పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అని అనుకుంటున్నారట. ఆల్రెడీ రష్మికను అప్రోచ్ అవ్వగా.. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా బోయపాటికి పదో సినిమా కాగా, రామ్‌‌కి 20వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్​ చుట్టూరి నిర్మిస్తుండగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

rashmika said yes to ram and boyapati's pan india movie?

పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రామ్ – బోయపాటి ఈ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ హిందీలో డబ్బింగ్ సినిమాలతో రామ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బోయపాటి శ్రీను సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ అయ్యాయి. వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక, రష్మికకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.’పుష్ప’తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. రామ్ – బోయపాటి శ్రీను సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకోవాలని అనుకోవడానికి పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ కూడా ఒక కారణమట.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *