కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్న రష్మిక మందన!

Rashmika Mandana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. ఛలో సినిమాతో.. తన చిలిపి చేష్టలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే ఎక్కు ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆపై పలు సినిమాలలో నటించి తన అందంతో ఇండియన్ క్రష్ గా ఓ వెలుగు వెలుగుతుంది.

Rashmika Mandana
Rashmika Mandana

ఇక ఈ భామ ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ లో ర్యాపో పెంచుకుంది. ఇదిలా ఉంటే ఈ భామ కొత్త ఇంట్లో కి గృహ ప్రవేశం చేస్తుందనే అనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆలోచింపజేస్తుంది. ఆ వీడియోలో రష్మిక సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది.

ఇక దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుంటుంది అనే రూమర్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది కాబట్టి అక్కడ ఒక మంచి ఇంటిని కొనుగోలు చేసి త్వరలోనే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తుందేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది రష్మిక మిషన్ మజ్ను, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు ఈ బ్యూటీకి ఇంకెంత ఫేమ్ సంపాదించి పెడతాయో వేచి చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *