ధనుష్, ఐశ్వర్య విడాకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ధనుష్ తండ్రి!

Dhanush and Aishwarya: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో ధనుష్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అటు తమిళం ఇటు తెలుగు రెండు వర్షన్ లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు తున్నాడు. ఇక ఇతడు రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 Dhanush and Aishwarya
Dhanush and Aishwarya

కానీ ఈ మధ్య వీరిద్దరి దాంపత్య జీవితానికి బ్రేక్ ఇచ్చినట్టు నటుడు ధనుష్ సోషల్ మీడియా వేదికగా అర్ధరాత్రి అధికారికంగా తెలియజేశాడు. ఈ విషయాన్ని ధనుష్ ఒక్కసారిగా వెల్లడించడంతో సెలబ్రెటీలు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఇక అభిమానులకు ధనుష్ షాక్ ఇవ్వడంతో అభిమానులకు గత రెండు రోజులుగా ఏమీ అర్థం కావడం లేదు.

అసలు ఎందుకు విడిపోయి ఉంటారు. వీరు విడిపోవడానికి కారణం ఎవరై ఉంటారు. మళ్లీ కలుస్తారా లేరా అని అభిమానులలో ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి ధనుష్ తండ్రి కస్తూరి రాజా తాజాగా మీడియా సమావేశంలో కొన్ని విషయాలు తెలిపాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సాధారణం. ధనుష్, ఐశ్వర్య ల మధ్య అలాంటి గొడవలే జరిగాయి.

ప్రస్తుతం వారిద్దరూ చెన్నై లో లేరు. హైదరాబాదులో ఉన్నారు. వారిరువురితో ఫోన్ లో మాట్లాడాను. కొన్ని సలహాలు సూచనలు అందించాను. రజినీకాంత్ కూడా విడాకుల గురించి మరోసారి పరిశీలించాలని వారిద్దరినీ అడిగారు. ఇలానే చాలామంది సెలబ్రెటీలు.. పిల్లల భవిష్యత్తు గురించి విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *