పాము కాటుతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్…

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్ లో ఆయన ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి సల్మాన్ పాముకాటుకు గురికాగా… వెంటనే హాస్పిటల్ కు తరలించారని అంటున్నారు. అయితే సల్మాన్ ను విషం లేని పాము కాటేయడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజిఎమ్ హాస్పిటల్ లో సల్మాన్ ను జాయిన్ చేశారు.

bollywood hero salman khan joined in hospital

పాము కాటు వేసిన తర్వాత.. సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆయన అనుచరులు ట్రీట్మెంట్ అనంతరం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సల్మాన్ ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని వైద్యులు వెల్లడించారు.

ఇక ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రేపు సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు జరుపుకోనుండగా ఇలాంటి సమయంలో పాముకాటుకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్ జాన్’ సీక్వెల్ ను ప్లాన్ చేశారు. 2015లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీనికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *