‘నేను మంచి కొడుకును కాదమ్మా’ అంటూ ఆర్జీవీ ట్వీట్‌..!

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. ఎవరైనా వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటారు కానీ వర్మ మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. తరచూ ఏదోక విషయంపై కామెంట్స్ చేస్తూ వివాదాల్లో నిలుస్తుంటారు. బంధాలకు, అనుబంధాలకు దూరంగా ఉంటానని చెప్పే వర్మ..రియాలిటీలో మాత్రం సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ మాతృదినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. తనదైన శైలిలో తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పోస్ట్ పెట్టారు. తాను మంచి కొడుకును కాదంటూ వ్యాఖ్యానించారు.

Ram Gopal Varma mother's Day tweet goes viral

’హ్యాపీ మదర్స్ డే అ‍మ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో ఆర్జీవీ చేతిలో గ్లాస్‌ పట్టుకొని ఉన్నారు. గతంలోనే ఓ సారి ఈ ఫోటో షేర్ చేశారు ఆర్జీవీ. తాజాగా మరోసారి తన తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేసి ఇలా విషెస్ చెప్పడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ వర్మ ఇప్పటివరకు చేసిన ట్వీట్స్‌తో పోలిస్తే కాస్త స్పెషల్ అనే చెప్పాలి. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుతూ ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘మీలో ఈ యాంగిల్ కూడా ఉందా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘మీరు మారిపోయారు సర్’’ అంటూ జోకులేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ పెట్టింది నువ్వేనా అంటూ అడుగుతున్నారు.

https://twitter.com/RGVzoomin/status/1523167320637468673?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1523167320637468673%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fram-gopal-varma-s-emotional-post-on-his-mother-32674

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటవల వర్మ డైరెక్ట్ చేసిన ‘డేంజర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక వివాదాల అనంతరం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *