పాపం.. ఆర్ఆర్ఆర్ తో రాజమౌళికి తిప్పలు.. మండిపడుతున్న ఇండస్ట్రీ పెద్దలు!

రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూడని ప్రేక్షకులే లేరు. ఎందుకంటే ఆయన సినిమాలకు అంత క్రేజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పటికే బాహుబలితో పలు భాషలలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో బాగా ఆసక్తి పెరిగింది. అలా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లు, పాటలు, ట్రైలర్లు ఇలా ప్రేక్షకులను ఉత్సాహంలో ముంచాయి. మొత్తానికి ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకి రానుందని గతంలో ప్రకటించారు. గతంలో ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది.

దీంతో ఈ సినిమాకు మరింత ఆలస్యం కావడంతో మొత్తానికి 7న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అంతలోనే రాజమౌళి వచ్చి పెద్ద సునామీ సృష్టించాడు. ఈ సినిమా 7న విడుదల కాదని ఈ విధంగా వాయిదా వేశాడు. ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని..

బేషరతుగా ప్రేమిస్తున్న అభిమానులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి.. వీలైనంత త్వరగా ఈ సినిమాను మళ్లీ మీ ముందుకు తీసుకువస్తామని అన్నారు. నిజానికి రాజమౌళి ఈ నిర్ణయాన్ని తప్ప లేకుండా నిర్ణయించాడు. నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆయనకు ఒత్తిడి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కానీ రాజమౌళిపై సినిమా పెద్దలు బాగా సీరియస్ అవుతున్నారు. ఈయన సినిమా కోసం తమ సినిమాలన్నీ వాయిదా వేయాల్సి వచ్చిందని లేదంటే తమ సినిమాలు ఈ పాటికే విడుదల అయ్యేవని అంటున్నారు. మళ్ళీ ఈ సినిమా విడుదల సమయంలో తమ సినిమాలకు అడ్డు వస్తుందని అంటున్నారు. పాపం రాజమౌళికి ఈ సినిమాతో తిప్పలు బాగా ఉన్నాయని తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *