నాని బర్త్ డే బ్లాస్ట్.. కొత్త సినిమా అప్‌డేట్ రెడీ..!
‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో హిట్ కొట్టిన నాని, ఆ తరువాత ‘అంటే సుందరానికీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ పనులు పూర్తైనట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. అయితే తాజాగా మేకర్స్ అదిరిపోయే న్యూస్‌తో వచ్చారు. నాని బర్త్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు.
⚠️ Homam Alert 🔥
On the occasion of Sundar's puttina roju, witness the quirky shade of young Sundar coming all the way to tickle your senses as "Barthhday Homam"
Shuba Muhurtham: 23rd Feb, 04.05 PM#SundarBarthhdayBlast 💥#AnteSundaraniki @NameisNani @nazriyafahadh pic.twitter.com/9M5M1dUhvq
— Mythri Movie Makers (@MythriOfficial) February 22, 2022
ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ మేకర్స్ ఫన్నీ పోస్టర్ ను విడుదల చేశారు. ‘హోమం అలర్ట్ ..సుందర్ బర్త్ డే బ్లాస్ట్ Sundar Birthhday Blast..యువ సుందరుడి బర్త్ డే హోమం..రేపు సాయంత్రం 04:05 గంటల నుండి మొదలు’..అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. మెడలో తెల్ల టవాలు, భుజానికి జంధ్యం, చేతులకు నామాలు, నుదిటన బొట్టుతో చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు నాని. వివేక్ ఆత్రేయ టీం చాలా కొత్తగా, క్రియేటివ్‌గా నాని పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
అయితే రేపు ఈ మూవీ నంచి టీజర్ గానీ, గ్లిమ్స్ గానీ విడుదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంతో నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. నదియా, సుహాస్, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. మరోవైపు ఇటీవలే నాని, కీర్తి సురేష్ జంగా వస్తున్న రెండో చిత్రం ‘దసరా’ ఫూజాకార్యక్రమం కూడా పూర్తయ్యింది. రెగ్యూలర్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు దసరా టీం.