‘శ్రీవల్లి’ని వాయించిన ముంబయి పోలీసులు

పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్​ నటించిన సినిమా పుష్పా తెరకెక్కింది. కేవలం తెలుగులో మాత్రమే కాక.. తమిళ్​, హిందీ, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో కూడా ఈ సినిమా డబ్ అయ్యింది. దీనిలోని ఉండే పాటలు, డైలాగ్స్ ఇండియా మొత్తం మీద ఓ రేంజ్​ లో పేలాయి. అంతే గాకుండా అల్లు అర్జున్​ వేసిన స్టెప్పులు అతని మేనరిజమ్స్ ఉట్టి పడేలా కొన్ని సన్నివేశాలు సినిమాను ఎక్కడకో తీసుకెళ్లాయి. సినిమా రిలీజ్​ అయ్యి చాలా రోజులు అయినా కానీ ఇప్పటికీ జనాల గుండెలను షేక్ చేస్తూనే ఉన్నాయి.

PUSHPA SRIVALLI SONG PLAYED BY MUMBAI POLICE BAND
PUSHPA SRIVALLI SONG PLAYED BY MUMBAI POLICE BAND

అయితే ఈ సినిమాలో చెప్పుకొ దగ్గ పాట ఒకటి శ్రీవల్లి. అయితే ఈ పాటతో సినిమాకు ఓ రేంజ్​ లో మైలేజ్​ వచ్చింది. అదే మైలేజ్​ సినిమాను కూడా అదే స్థాయిలో ఆడేలా చేసింది. ఎంతలా మాయ చేసింది అంటే ఈ పాట వినబడిందంటే చాలు చాలా మంది కళ్ల ముందుకు అల్లు అర్జున్ ప్రత్యక్షమై కాలుని ఈడ్చుకుంటూ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తాడు. అదే తమన్ సంగీతం మనల్ని కట్టిపడేసేలా చేస్తుంది.

అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ ను పోలీసులు కూడా వాయించారు. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే.. పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఈ సంగీతాన్ని ముంబయి పోలీసులు కూడా వాయించారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *