సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్‌ కౌర్‌..!

నటి పూనమ్‌ కౌర్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. పలు వివాదాలతో హైలెట్‌ అయ్యారు. పూనమ్‌ కౌర్‌ ప్రస్తుతం నాతిచరామి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

poonam kaur talk about her personal life

`దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ మీద కన్ను వేసిన వాడు రాక్షసుడైతాడు. అదే కథైతే..` అంటూ స్టార్ట్ చేసిన పూనమ్‌ చాలా షాకింగ్‌ విషయాలను పేర్కొంది. ‘‘నేను మధ్యతరగతి అమ్మాయిని. అందరిలానే నాకూ పెళ్లి చేసుకుని, మంచి జీవితాన్ని గడపాలని ఉండేది. నేను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ కొందరు నన్ను కించపరిచేవారు. అలా ఎందుకు చేశారో, చేస్తున్నారో నేను ఆలోచించను. నా పనిపైనే దృష్టి పెడతా. జీవితంలో ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటా. అమ్మ విషయంలో నాకు ఎక్కువగా బాధ ఉంది. ఏ తల్లైనా కూతురికి త్వరగా పెళ్లి అయితే సంతోషిస్తుంది. ఈ విషయంలో అమ్మను తలచుకుంటే ఎమోషన్‌ అవుతా’’అంటూ చెప్పుకొచ్చారు.

“పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా కొందరు రావణులు అడ్డుకున్నారన్నారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు జీవితంలోకి వచ్చి నాశనం చేసి వెళ్లిపోయారు. ధైర్యం కోసం రోజూ సీత, దుర్గా, ద్రౌపదిలనే తలచుకున్నా. అలా చేయడం వల్ల చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను. ఈ భాదలను భరించలేక ఇక సినిమాలు చేయను, ఇండియా నుంచి వెళ్లిపోతా అనుకున్న సమయంలో.. నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి.. ఇలా ఒక ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ ఉందని, ఇది రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉన్న కథ అని చెప్పడంతో ఈ సినిమాలో నటించాను” అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ఇక పూనమ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. పూనమ్ కౌర్..ఎస్‌వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైయ్యారు. ఆ సినిమా తర్వాత.. అడపా దడపా పలు సినిమాల్లో నటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *