ఆ వీడియో షేర్‌ చేసి మురిసిపోతున్న మహేశ్‌ బాబు

టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలోని పెన్నీ సాంగ్‌లో సితార తళుక్కున మెరిసి తనలోని టాలెంట్‌ని వెండితెరకు పరిచయం చేసింది. సీతూ పాప చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. ఇక ఇప్పటివరకు వెస్ట్రన్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న సితార.. తొలిసారిగా కూచిపూడి నాట్యం చేసి అందరిని ఆకట్టుకుంది.

Super star Mahesh Babu shares Kuchipudi dance video of his daughter

 

సితార కూచిపూడి డ్యాన్స్‌ చేయటంతో మహేశ్‌బాబు అమితానందంలో ఉన్నారు. తన ముద్దుల కుమార్తె సితార ప్రతిభను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. కుమార్తెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇక సితారకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. పాశ్చత్య, సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ తీసుకుంటోంది. వీటికి సంబంధించిన పలు వీడియోలను సైతం ఆమె తరచూ సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటోంది. కాగా, ఆదివారం ఉదయం నెటిజన్లలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్‌ ఓ స్పెషల్‌ మీడియా షేర్‌ చేశారు. ‘శ్రీరామనవమి రోజున సితారా నాట్యం చేయడం చాలా ఆనందంగా ఉంది, ఆ స్తోత్రం ఆ రాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆమె గురువులైన అరుణ్ భిక్షు, మహతి భిక్షులకు ధన్యవాదాలు’ అని అని సితార వీడియోను మ‌హేశ్ బాబు పోస్ట్ చేశారు.

ఇక మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12న విడుదల అవనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఈ చిత్రంకు ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *