రామతీర్థం వివాదంలో అశోక్ గజపతిపై కేసు నమోదు

విజయనగరం రామతీర్థంలో చోటుచేసుకున్న వివాదంలో విజయనగరం తెదేపా సీనియర్ నేత అశోఖ్ గజపతి రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసు స్టేషన్​లో కేసు రిజిస్టర్ చేశారు. రామతీర్థంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు, తమ విధులకు కూడా ఆటంకం కలిగించారంటూ.. అశోక్ గజపతి రాజుపై ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సెక్షన్473, 353 కింద అశోక్ గజపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

police-registered-case-against-former-union-minister-ashok-gajapathi-raju-at-nellimarla-police-station

అసలేం జరిగిందంటే… 

విజయనగరం బోడికొండపై బుధవారం రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సమయంలో ఆలయ ధర్మకర్త అశోక్​ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తనను కొబ్బరికాయ కొట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు నేతలు, కార్యకర్తల మధ్య ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే శిలా ఫలకం బోర్డును కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కానీ, ఎట్టకేలకు పోలీసుల చొరవతో పరిస్థితిని అదుపు చేసి.. శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెదేపా నేత చంద్రబాబు సహా, పలువురు నేతలు స్పందించారు.

మంత్రులు అశోక్​ గజపతిరాజుపైకి రౌడీల్లా వెళ్లారని చంద్రబాబు అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉంటూ.. అలా ఎలా ప్రవర్తించారంటూ ప్రశ్నించారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న గజపతిని ఎలా అడ్డుకుంటాంరని మండిపడ్డారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *