పోలీసు శాఖ స్థలం వైసీపీ కార్యాలయానికా? : వర్ల రామయ్య

రాష్ట్రంలో ప్రజల ధన, మాన  ప్రాణాలు, శాంతిభద్రతలను సజావుగా కాపాడటంకోసం పోలీసుశాఖ ఉందని,  వాటిని కాపాడటమే పోలీసు వ్యవస్థ ప్రధాన లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అన్నారు. ‘‘ప్రజల మాన, ప్రాణాలు కాపాడుకోవటానికి ఉన్న వ్యవస్థనుజగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారు.  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో  రాష్ట్రంలో పోలీసు శాఖ తమ ఆస్తులనే కాపాడుకోలేని దుస్థితిలో ఉంది.  ఇక  ప్రజల ఆస్తులను ఎలా కాపాడుతారు? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వారు వైసీపీకి అడుగులకు మడుగులొత్తుతున్నారు.  తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామం ఒక చారిత్రాత్మక గ్రామం. చంద్రగిరి పట్టణానికి ఒక చారిత్రాత్మక చరిత్ర ఉంది.

అది పురాతనమైన గ్రామం. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఒక పెద్ద కోట కట్టారు. ఇదొక యాత్రా స్థలం. చంద్రగిరి పట్టణాన్ని టూరిజం శాఖ అభివృద్ధి చేస్తోంది. అక్కడ బ్రిటీష్ కాలం నుండి 1 ఎకరా 33 స్థలం పోలీసు శాఖ కంట్రోల్ లో ఉంది. అక్కడ పోలీస్ క్వార్టర్స్, జిమ్, ఆశాఖకు సంబంధించిన నిర్మాణాలు కట్టాలనే ఉద్దేశంతో అక్కడ బ్రిటీష్ ప్రభుత్వం స్థలం కేటాయించారు. 1 ఎకరా 33 సెంట్ల ఈ స్థలం పోలీసులకు చెందినదని అడంగల్ లో క్లియర్ గా ఉంది. పోలీసువారి స్థలానికే రక్షణ లేకపోతే ఎలా?

ఆ స్థలంలో ఈ స్థలం పోలీసు శాఖకు చెందినదని బోర్డు కూడా పెట్టారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేమెక్కగలదు? అనే సామెతలా వారి ఆస్తిని వారు కాపాడుకోలేనివారు ప్రజల ఆస్తులను ఏం కాపాడగలరు? వారి ఆస్తులను కాపాడుకోవడంలో పోలీసు శాఖ ఘోరాతిఘోరంగా విఫలమైంది. పోలీసు స్థలాన్ని వారే వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వటం జరిగింది. పోలీసు పెరేడ్ గ్రౌండ్, పోలీసు స్టేషన్, పోలీసు జిమ్, పోలీసు కల్యాణ మండపం లాంటివి కట్టుకోవడానికి ఇచ్చినా అర్థముందిగానీ పోలీసులకు చెందిన స్థలాన్ని ఒక పార్టీ కార్యాలయ నిర్మాణాకి ఇవ్వడంలో అర్థంలేదు’’ అని ఆక్షేపించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *