లోకేష్ జూమ్ కాల్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ

పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాల్ లోకి వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రవేశించారు. వంశీ ఆఫీసు నుంచి జూమ్‍లో ఓ బాలిక లాగిన్ అయింది. ఆమె దగ్గర నుండి వంశీ సెల్ ఫోన్ తీసుకున్నారు. దీంతో అలర్టైన నిర్వాహకులు వైసీపీ ఎమ్మెల్యేలు జూమ్‍ సమావేశాలకు వచ్చారని లోకేశ్‍కు చెప్పారు. వైసీపీ నేతలు ఉన్నా పర్లేదని, వాళ్ల ప్రభుత్వం ఎలా ఏడ్చిందో తెలుస్తుంది లోకేష్ బదులిచ్చారు. విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతగానితనం అని, దొంగ ఐడీలతో కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తారా అని లోకేశ్ ప్రశ్నించారు. దీంతో వెంటనే జూమ్ నుంచి వల్లభనేని వంశీ తప్పుకున్నారు.

ఇక కార్తిక్ కృష్ణ విద్యార్థి పేరుతో జూమ్‍లో కొడాలి నాని పాల్గొన్నారు. జూమ్‍లో ఎవరు పాల్గొన్నా పర్లేదు,  ప్రభుత్వ చేతకాని తనాన్ని ఎండగడతాం, ప్రభుత్వ వైఫల్యాలు వారు చూస్తున్నారని లోకేష్ అన్నారు. ఈ సమావేశం పది పరీక్షలు రాసిన విద్యార్థులకు మాత్రమేనని, ఎప్పుడో పది, పద్దతి తప్పిన కుక్కలకు ఈ సమావేశం కాదంటూ లోకేశ్ చురకులు అంటించారు. దమ్ముంటే నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2 లక్షల మంది ఎందుకు పది పరీక్షలు తప్పారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

దీనికి ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరూ సమాధానం చెప్పాలన్నారు. గతేడాది పరీక్షలను వాయిదా వేయాలని మీరే కోరారాని, ఇప్పుడు పరీక్షలు పెట్టడంతో అలవాటు తప్పిందని వైసీపీ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన కొత్తపల్లి రజనీ అన్నారు. దీనికి లోకేష్ బదులిస్తూ పరీక్షల ప్యాటరన్ మార్చమని మిమ్మలను ఎవరు అడిగారని, టీచర్లను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయా అని అన్నారు. అంతకముందు వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *