Nara Lokesh: దోచుకోవడం ఆపేసి.. ఇకనైనా అభివృద్ధి మొదలుపెట్టండి- నారా లోకేశ్​

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్​కు మూడురాజధానుల విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందుకు ధీటుగా సరికొత్త ప్రణాళికతో త్వరలోనే ముందుకొస్తామని పేర్కొంది. మరోవైపు ఇటీవలే విశాఖలో హెచ్​ఎస్​బీసీ కూడా మూతపడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

nara-lokesh-sensational-comments-on-ysrcp

తాజాగా, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు మాటర్​ లేని మూడు రాజధాల పేరు చెప్తూ.. జగన్ కాలక్షేపం చేస్తుంటే.. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్​గా విరసిల్లిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని మండిపడ్డారు.

గత 15 ఏళ్లుగా వేలాది మంది ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోన్న హెచ్​ఎస్​బీసీని మూతబడేలా చేయడం బాధాకరమని అన్నారు లోకేశ్​. రాష్ట్ర ప్రభుత్వం నియంతగా ప్రవర్తిస్తోందని.. వాళ్ల బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయని అన్నారు. ఇప్పుడు హెచ్ఎస్​బీసీ మూతపడటం జగన్​ అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో మోసం చేసింది చాలని.. విశాఖని దోచుకోవడం ఆపేసి.. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు లోకేశ్​. ఉన్న కంపెనీలనైనా ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చూడాలని జగన్​ను కోరారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *