రెండు ఓటీటీల్లో రిలీజ్‌ కాబోతున్న భీమ్లా నాయక్‌

పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భీమ్లా నాయక్‌’.  అభిమానుల అంచనాలను అందుకుంటూనే అంతకంటే ఎక్కువ స్థాయిలో పవర్ స్టార్‌ని నిలబెట్టిన సినిమా ఇది. బీమ్లా నాయక్‌ని ఢీకొనే పాత్రలో యువ కథానాయకుడు రానా తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన సినిమా ఇది. బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది ‘భీమ్లా నాయక్‌’ . విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.

Pawan bheemlanayak ott release date announced

ఈసారి డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు భీమ్లా నాయక్ మేకర్స్. ఒకటి కాదు.. రెండు ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఒకేరోజున స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారింగా ప్రకటించారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏తోపాటు.. ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే రోజున ప్రపంచవ్యాప్తంగా జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. పవర్ స్టార్ యాక్షన్ సీన్స్‌.. తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అన్ని కలిపి సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇక విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనున్నాడు భీమ్లా నాయక్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *