అల్లు అర్జున్‌పై మెగాస్టార్‌ ట్వీట్‌ వైరల్‌.. సెలబ్రేషన్స్‌ షురూ..!

ఇటీవల రిలీజ్‌ అయిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు కాన్‌ స్టార్‌ అల్లు అర్జున్. ఏప్రిల్‌ 8న బన్నీ 40వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ సెలబ్రెటీలు బన్నీకి స్పెషల్‌ విషెస్‌ తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

icon-star-allu-arjun-birthday-celebrations

‘‘హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో’’ అని చిరు పేర్కొన్నారు. చిరు చేసిన ట్వీట్‌పై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరు ట్వీట్‌ను ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తూ అభిమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆయన ట్వీట్‌ను ర్వీట్వీట్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లో ఈ ట్వీట్‌కు 23వేలకు పైగా లైక్స్‌, 4 వేలకు పైగా రీట్వీట్స్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి.

ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు తన 40వ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సెర్బియాలోని బెల్‌గ్రేడ్ వెళ్లారు. తనతో పాటు వైఫ్ అల్లు స్నేహారెడ్డి, 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. “హ్యాపీ ఎట్ 40” అంటూ ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదే విధంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ ఒక పోస్ట్ చేశారు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *