పాన్‌ ఇండియాపై కన్నేసిన మరో టాలీవుడ్‌ హీరో.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్‌ ఇండియా మార్కెట్ హవా నడుస్తుంది. మన హీరోలు చాలా మంది వాళ్లు నటిస్తోన్న సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌, తాజాగా యశ్.. ఇలా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా అటువైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.

Nikhil Siddhartha's first pan India film titled 'SPY' first look out

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ నటిస్తున్న 19వ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గూడఛారి, ఎవరు, హిట్‌ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు స్పై అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో నిఖిల్‌ గన్‌ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పోస్టర్‌లో నిఖిల్ లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది.

ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. మ‌ల‌యాళ బ్యూటీ ఐశ్వ‌ర్య మీన‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక నిఖిల్‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వస్తుందో లేదో చూడాలి మరి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *