అతను ఓవర్ చేస్తున్నాడు వెంటనే వదిలేయండి అంటూ మౌనరాగం అమ్ములుకు సలహా!

బుల్లితెరపై ప్రసారమైన మౌనరాగం సీరియల్ పూర్తయి ఎన్నో రోజులు కాగా ఇప్పటికీ ఆ సీరియల్ ను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా అందులో నటించిన అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్, అంకిత్ అలియాస్ శివ కుమార్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. మంచి అభిమానంను సొంతం చేసుకున్నారు.

ఇక వీరిద్దరు రీల్ లైఫ్ లో పెళ్లి చేసుకోవడానికి ఎంత ఆరాటపడ్డారో చూసాం. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి బాగానే ఆరాటపడుతున్నారు. ఎందుకంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు కాబట్టి. ఈ విషయాన్ని తామే స్వయంగా అభిమానులకు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన ఫోటోలు బాగా షేర్ చేసుకుంటారు.

వీరిద్దరు కలిసి గుళ్లకు, పార్టీలకు బాగా తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు తమ ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట రెడ్ కౌచ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇక శివకుమార్ తన జీవితంలో అమ్మ, నాన్న, ప్రియాంక తప్ప మరెవరూ లేరని క్లారిటీ ఇచ్చాడు.

ప్రియాంక కూడా కాసేపు తన అభిమానులతో ముచ్చటించింది. అందులో ఓ నెటిజెన్ ప్రియాంకకు సలహా ఇచ్చాడు. నటుడు శివ కుమార్ కాస్త ఓవర్ చేస్తున్నారు.. మీరు వెంటనే తనకు బ్రేకప్ చెప్పండి అంటూ సలహా ఇవ్వటంతో ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక వీరిద్దరూ బుల్లితెరపై పలు సీరియల్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రియాంక నాగార్జున సినిమాలో అవకాశం కూడా అందుకున్నట్లు తెలిసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *