తల్లి కాబోతున్న నయనతార?

స్టార్‌ హీరోయిన్‌ నయనతార , డైరెక్టర్ విగ్నేష్ శివన్ చాలాకాలంగా సహజీవనం చేస్తోన్న విషయం విదితమే. కానీ, ఈ ఇద్దరూ ఇంతవరకు పెళ్ళి విషయమై ఎలాంటి ప్రకటనా చేయడంలేదు. ఇద్దరూ కలిసే వుంటున్నారు. పుట్టినరోజు వేడుకలు, ప్రేమికుల దినోత్సవం సంబరాలు.. ఇరువురి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కలిసే హాజరవడాలు.. కథ పెద్దదే నడుస్తోంది. ఇటీవలే వీరి పెళ్లిపై పలు రూమర్స్‌ వచ్చినా.. ఎప్పటిలానే వీరిద్దరూ దీనిపై ఏమాత్రం స్పందించలేదు. అయితే నయనతారకి సంబంధించి ఒక వార్త నెట్టింట తెగ హల్‌చల్‌ అవుతుంది.

nayanthara, vignesh shivan is going to be a mother with surrogacy ?

నయన్‌, విఘ్నేశ్‌లు పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట. సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట నయన్‌. దీనికి విఘ్నేశ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నయన్‌, విఘ్నేశ్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇప్పటికే తమిళ మీడియా, వెబ్‌సైట్‌లలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఆఫర్లతో నయన్‌ ఫుల్‌ బిజీగా ఉంది, అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఆమె ఎంచకుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

nayanthara, vignesh shivan is going to be a mother with surrogacy ?

నయన్ పెళ్లి, సరోగసి వంటి వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ తో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి గుళ్లూ గోపురాలు సందర్శిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నమాట వాస్తవం. అయితే ఆ పూజల్లో భాగంగా నుదుటిపై బొట్టు పెట్టుకుంటే పెళ్లైపోయిందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. అటు వీళ్లు పేరెంట్స్ కావాలనుకుంటున్న మాటల్లో కూడా అస్సలు నిజం లేదని తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *