కొడుకు ప్రాణాలతో తల్లి చెలగాటం.. అపార్ట్​మెంట్​ పై నుంచి..!

Viral: ఓ మహిళ తన కన్న కొడుకు ప్రాణాలను ఫణంగా పెట్టిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ ​గా మారాయి. దిల్లీ సరిహద్దుల్లో ఉండే ఫరీదాబాద్​లో ఓ అపార్ట్​మెంట్​ ఉంది. దానిలో ఉండే ఓ తల్లి 10వ అంతస్తు నుంచి చీర సహాయంతో తన కొడుకును 9వ అంతస్తులో ఉండే బాల్కనీలోకి దించింది. ఆ తొమ్మిదో అంతస్తులో పడి ఉన్న తమ బట్టలను పైకి తెచ్చుకునేందుకు ఈ విధంగా చేసింది. ఇలా కన్న కొడుకు ప్రాణాలతో రిస్క్​ గేమ్​ ఆడింది. దీనిని చూసిన వారు ఆ తల్లి చేసిన ఈ వికృత క్రీడను దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె అసలు కన్న తల్లేనా అని ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన దిల్లీ-హర్యానా సరిహద్దుల్లో ఉండే ఫరిదాబాద్ లోని సెక్టర్​ 82లో జరిగింది. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు అయినా ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియో వైలుగులోకి వచ్చింది.

Viral
Viral

ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని చూసిన వాళ్లు ఘటన వెలుగులోకి వచ్చింది. బట్టల కోసం కుమారుడి ప్రాణాలను ఫణంగా పెట్టడం ఏంటని ఆ మహిళపై నెటిజన్లు ఫైర్​ అవుతున్నారు. ఆ తల్లికి ఇంతకంటే మంచి ఫ్లాన్​ ఇంకోటి దొరకలేదా అని అంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. దిల్లీ సరిహద్దుల్లో ఉండే ఫరీదాబాద్‌ లో ఓ అపార్టుమెంట్‌ ఉంది. దానిలోని పదో అంతస్తులో ఆ తల్లి ఉంటుంది. అయితే రోజులరానే బాల్కనీలో బట్టలను ఆరేయగా అవి కొన్ని 9వ అంతస్తులో ఉన్న ఇంటి బాల్కనీలో పడ్డాయి. దీంతో కిందకు వెళ్ళి తీసుకురావాలి అంటే పొరుగింటి వాళ్లు తాళం వేసి బయటకు వెళ్లారు. దీంతో చేసేది లేక కుమారుడ్ని చీరకు కట్టి.. కిందకు దించింది. ఆ బట్టలు తీసుకున్న ఓ బాలుడు మరలా అదే చీర సాయంతో పైకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎదురు అపార్ట్మెంట్​లో ఉన్న ఓ వ్యక్తి గమనించి వీడియో తీశాడు. దీనిని సామాజిక మాద్యమాల్లో ఉంచగా ప్రస్తుతం ఇది వైరల్​ అవుతుంది. ఇదిలా ఉంటే కుమారుడి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ తల్లికి అపార్ట్​మెంట్ వాళ్లు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *