సినిమా టికెట్ల కోసం లైన్లో నిల్చున్న మహేశ్ బాబు.. వీడియో వైరల్
అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ చిత్ర ప్రమోషన్స్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా రంగంలోకి దిగారు. ‘మేజర్’ సినిమా టికెట్ల కోసం మహేశ్ బాబు కూడా లైన్‌లో నిలబడ్డారు. ప్రస్తుతం ‘మేజర్’ టీమ్‌తో కలిసి మహేశ్ బాబు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజుకో సెంటర్‌లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు.
కొన్ని రోజులుగా పలు ఏరియాల్లో హీరో అడివి శేష్‌తో కలిసి చిత్రయూనిట్ ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ కోసం మహేశ్ బాబు కూడా రంగంలోకి దిగి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారికతో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు. ఆ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో భాగంగా నిహారిక సినిమా టికెట్ కోసం లైన్‌లో నిలబడగా ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మధ్యలో అడివి శేష్ రావడంతో లైన్ లో అలా మధ్యలో వచ్చేస్తారేంటి అని నిహారిక అడివిశేష్ తో గొడవ పడుతుంటే మహేష్ బాబు వచ్చి లైన్ మధ్యలో నిల్చుంటాడు. మహేశ్‌బాబుని చూడగానే నిహారిక సర్‌ప్రైజ్ అవుతుంది. మా స్నేహితులను కూడా పిలవొచ్చా అని మహేశ్ అడగ్గానే ఓకే అంటుంది. దాంతో లైన్ పెరుగుతుంది. నిహారిక మహేష్ ని ఫోన్ నంబరు అడిగేలోపు మహేశ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అడివి శేష్ నా నుంబర్ ఇవ్వనా అంటే నీది ఎందుకు అంటూ ఫన్నీగా ఈ వీడియో ముగుస్తుంది.
https://twitter.com/JustNiharikaNm/status/1530846722993270785?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1530846722993270785%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-8095284461000550761.ampproject.net%2F2205120110001%2Fframe.html