యాంకర్ సుమ: రాజీవ్‌తో గొడవలు నిజమే, కానీ..!

తెలుగు వినోద పరిశ్రమలో యాంకర్ సుమ తనదైన ముద్ర వేసింది. బుల్లితెరపై పలు షోలతో సందడి చేస్తూనే, సినిమా ఈవెంట్లలో వ్యాఖ్యాతగా అలరిస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంత మంది హాట్ యాంకర్లు వస్తున్నా.. సుమను మాత్రం ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. బుల్లితెర మహారాణిగా చెలామణి అవుతోన్న ఈమె గతంలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసింది. కానీ ఆ తరువాత పూర్తిగా యాంకరింగ్‌కి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు వరుస పలు టీవీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా గడుపుతోంది. చాన్నాళ్ల తర్వాత ఆమె  ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయతీ’ చిత్రం మే 6న విడుదల కాబోతోంది.

Anchor Suma Gives Clarity on Clashes with Her Husband Rajeev Kanakala

ఈ చిత్రానికి కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వం వహించగా.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు సుమ కనకాల. మరోవైపు సుమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. తన భర్త రాజీవ్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయని, విడిపోవాలనుకున్నారనే కథనాలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా ఓ టీవీ షోలో ఆమె స్పందించింది. ‘జయమ్మ పంచాయతీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె  ఆలీతో సరదాగా షోకు గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

‘‘నువ్వూ రాజీవ్‌ విడిపోయారని, నువ్వొక ఇంట్లో ఉంటే తను మరో ఇంట్లో ఉంటున్నాడని గతేడాది వరకూ వార్తలొచ్చాయి’’ అని ఆలీ వివరిస్తుండగా సుమ స్పందించింది. ‘‘ఇద్దరి మధ్య గొడవలు ఉండటమనేది వాస్తవమే. 23 ఏళ్లలో మా మధ్య ఎన్నో గొడవలు. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం తేలిక. కానీ తల్లిదండ్రులుగా అది చాలా కష్టం’’ అని సుమ పేర్కొంది. ఈ విషయాన్ని చెపుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఇక తనకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని… అయితే, ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆగానని తెలిపింది. చివరకు ‘జయమ్మ పంచాయతీ’ సినిమా వచ్చిందని చెప్పింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *