‘సర్కారు వారి పాట’ నుంచి అదిరిపోయే అప్డేట్..!

సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తోన్న మూవీ సర్కారు వారి పాట. మే12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ వేటలో పడ్డారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ma ma mahesha song promo release from sarkaru vari paata

ఈ సినిమా నుంచి మ.. మ.. మహేషా సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే.. ఈ మ.. మ.. మహేషా ఫుల్‌ సాంగ్ ను మే 7 వ తేదీ అంటే రేపు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది చిత్ర బృందం. ఈ పాట, మ్యూజిక్, లిరిక్స్, మహేష్ స్టెప్స్ ఆకట్టుకోగా ఫుల్ సాంగ్ పైన అంచనాలు పెంచేశాయి.

ma ma mahesha song promo release from sarkaru vari paata

అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, తమన్ సంగీతం అందించాడు. బోనిత గాంధీ, శ్రీకృష్ణ ఆలపించారు. ఇక ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్ యాక్షన్, రొమాంటిక్, కామెడీ డ్రామాగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://youtu.be/-o0r_MljIXg

Add a Comment

Your email address will not be published. Required fields are marked *