కేజీఎఫ్‌-3పై అదిరిపోయే క్లారిటీ..!

పాన్‌ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది ‘కేజీయఫ్‌2’. ఇప్పటికే రూ.1000కోట్ల కలెక్షన్లు దాటి ‘ఆర్ఆర్ఆర్‌’ను దాదాపు బీట్‌ చేసేసింది. సినిమా విడుదలై నెల రోజులు అయినా ఇప్పటికీ బాలీవుడ్‌లో రాఖీభాయ్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌’ అభిమానులకు మరో తీపి కబురు. ఈ ఏడాదిలోనే ‘కేజీయఫ్‌3’ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ తెలిపారు. ‘మార్వెల్‌ యూనివర్స్‌’ తరహాలో ‘కేజీయఫ్‌3’ని ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

KGF: Chapter 3 movie shoot to commence from this year end

”ప్రస్తుతం ‘సలార్’ సినిమా పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ వీక్ నుంచి లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ కూడా జాయిన్ అవుతారు. ప్రజెంట్ 30 – 35 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లేదా నవంబర్‌కు షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ‘కెజియఫ్ 3’ స్టార్ట్ చేస్తాం.ఈ ఫ్రాంచైజీని మార్వెల్‌ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం.  2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని విజయ్ కిరగందూర్ తెలిపారు.

కేజీఎఫ్‌-1 కి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2.. ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్‌ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక బాలీవుడ్‌లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *