చక చక సాంగ్ కు పెళ్లికూతురు డ్యాన్స్.. మామూలుగా లేదుగా!

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం మనల్ని అమితంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోను ఎక్కువ మంది షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వివాహాలకు సంబంధించిన వీడియోలు అయితే ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాదిలో మొహన బోగరాజు అనే సింగర్ పాడిన పాట మామూలుగా వైరల్ అవ్వలేదు. పెళ్లి బరాత్ డుగ్గు డుగ్గు బండి అంట చేసిన పెళ్లి కూతురు చేసిన సందడితో ఆ పాట పాడిన రాసిన ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే ఇలాంటి వీడియోనే మరో కటి ప్రస్తుతం వైరల్ అవుతుంది.

kerala bride dances to sara ali khan s chaka chak in viral instagram reel watch
kerala bride dances to sara ali khan s chaka chak in viral instagram reel watch

ఈ వీడియోలో కూడా కొత్త పెళ్లి కూతురు చేసిన డ్యాన్సుకు సోషల్ మీడియా అంతా ఫిదా అయ్యింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది లైకులు వర్షం కురిపిస్తున్నారు. అంతేగాకుండా ఆ వధువు వేసే స్టేప్పులకు ఫిదా అయ్యి తెగ షేర్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా… కేరళలో లోని త్రిసూర్ లో జరిగింది. ఈ పాటకు ఆ వధువు వేసిన డ్యాన్సుతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఈ పెళ్లికూతురు పెళ్లి మండపం చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ లో కేవలం తను మాత్రమే కాకుండా మరో ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ఇద్దరూ వేస్తున్న స్టెప్పులు పెళ్లి కూతురు వేసిన స్టెప్పులతో పోల్చితో దిగదుడుపుగా మారాయి. ఇంతకీ ఆమె వేసిన డ్యాన్స్ ఏ పాటకు అనేది తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా.. సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన చిత్రంలోనిది. చక చక్ పాటకు డ్యాన్స్ వేసింది. అయితే ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ గా మారుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *