మనోడి చేసిన ప్రపోజల్​ కు చిన్నది ఫిదా !

ప్రేమ… ఈ ప్రపంచాన్ని నడిపించడంలో దీని పాత్ర చాలా కీలకం. ప్రేమ అనేది లేని వారంటూ ఎవరూ ఉండరు. ప్రేమను చూపించని వారు కానీ… ప్రేమను అనుభవించని వారు కానీ ఈ లేరు అనడం అంటే అది కచ్చితంగా అబద్ధమే అవుతుంది. అలాంటి ఈ ప్రేమకు చిహ్నంగా మనం అందరం కలిసి అనుకున్న ఓ రోజే.. ప్రేమికుల రోజు. ఈ రోజున చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను తెలియజేస్తారు. ముందుగానే ప్రేమలో ఉన్న వారు అయితే ఒక విధంగా… కొత్తగా ప్రేమలో కి అడుగుపెట్టే వారు మరో విధంగా వారి వారి ప్రేమను తెలియజేస్తారు. అయితే సరిగ్గా నాలుగు రోజుల క్రితం అయిపోయిన ఈ వాలంటైన్స్ డే రోజున చాలా మంది ప్రొపోజ్​ చేయడం.. దానికి ఆ ప్రేయసి లేదా ప్రియుడు ఓకే చెప్పడం లాంటివి చేస్తారు. అయితే ఓ వ్యక్తి చేసిన చేసిన ప్రోపోజల్​ ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ అతను ఎలా చేశాడో ఓ లుక్కేద్దాం.

Watch: Meteorologist Tears Up After Being Surprised By On-Air Proposal
Meteorologist Tears Up After Being Surprised By On-Air Proposal

ప్రేమికుల దినోత్స‌వం రోజున అమెరికాలోని ఓ వ్యక్తి కొత్తగా థింక్ చేసి తనదైన శైలిలో ప్రొపోజ్​ చేశాడు. మేరీ లీ అనే ఓ న్యూస్ ప్రెజెంటర్​ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో పని చేస్తుంది. ఆమె తన పనిలో భాగంగా వెదర్ రిపోర్ట్ ను ప్రెజెంట్​ చేస్తుంది. ఇదంగా ఆ స్టూడియోలోని ఉత్త‌ర భాగంలో లైవ్​ లో ఇస్తుంది. అయితే ఇదే సమయంలో ఆమె లవర్ ఆ స్టూడియోకు వచ్చాడు. ఒక పక్క లైవ్ నడుస్తుండగానే ఆమెకు ప్రొపోజ్ చేశాడు. ఇది సామాజిక మాధ్యామాల్లో విరివిగా షేర్ చేశారు నెటిజన్లు.

ఇలా ఆమెకు హఠాత్తుగా వచ్చి ప్రొపోజ్​ చేయడంతో ఒక్క సారిగా అవాక్కైంది. తను కూడా తన ప్రేమను మాట్లల్లో చెప్పడానికి కిందకు వంగి మోకాళ్లపైన కూర్చుని రింగ్ చూపిస్తూ ఐ లవ్ యూ అని చెప్తుంటే ఆ యాంకర్ కంటిలో నీరు ఆగలేదు. ప్రేమను నింపుకున్న ఆ కన్నీరు కిందకు దూకుతుంటే.. చూసిన వారు వారి ప్రేమను అభినందించకుండా ఉండలేకపోయారు. అంతేకాదు ఇది అంతా లైవ్ లో జరుగుతున్నా కానీ ఆ ఛానెల్ లైవ్ ను ఆపలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *