వామ్మో తాత… ఏడు పదుల వయసులో బ్యాట్ తో రప్ఫాడిస్తున్నాడుగా..!

క్రికెట్ అంటే కొందరికి విపరీతమైన పిచ్చి ఉంటుంది. మ్యాచ్ అంటే చాలు పనులు కూడా పక్కన పెట్టేసి అతుక్కుపోతారు. అక్కడ వారి ఆటతీరును కనబర్చి ఎంతోమంది గల్లీ క్రికెటర్లు కూడా పుట్టుకొస్తుంటారు. బ్యాట్ పట్టి కుర్రాళ్లు ఆట ఆడుతారు. కానీ ఇక్కడ ఓ తాత మాత్రం బ్యాట్ ను రప్ఫాడిస్తున్నాడు. తగ్గేదే లే అంటూ పరుగుల వరద సృష్టిస్తున్నారు. ఆ క్రీజ్​ నుంచి ఈ క్రీజ్ కు ఒకే ఒక్క జంప్​ లో వచ్చే  చేస్తున్నాడు. కావాలంటే నన్ను రన్​ అవుట్ చేసుకోండి అని సవాలు విరుసుతున్నాడు.  ఒక్కొక్క పరుగూ తీసిన తరువాత తన ఆనందాన్ని రెట్టింపు చేసుకోని ఎగిరె గంతేస్తున్నాడు.

old man plays cricket with enthusiasm viral video
old man plays cricket with enthusiasm viral video

దాదాపు ఏడు పదుల వయసులోనూ ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. తాత క్రికెట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వామ్మో తాత ఈ స్టామినా ఎక్కడిది నీకు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న తాత వయసు సుమారు ఏడు పదులు ఉంటుందని అంచనా. ఆయన శరీరం ఇంకా చాలా ఫిట్ గా ఉంది. కుర్రాళ్లతో పోటీ పడుతూ మరీ ఉత్సాహంగా ఆయన క్రికెట్ ఆడుతున్నారు.

ఏదో నామమాత్రంగా కాదు.. పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యమ స్పీడుగా రన్ లు మీద రన్లు చేస్తున్నాడు. తాత ఆట తీరును చూసి.. అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ ఆట దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాత ఇలా ఆడి గల్లీ క్రికెట్ కు కూడా కొత్త భాష్యం చెప్పాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *