వివేకాను ఎవరు చంపారో తెలిసి కూడా నాటకాలా.? వర్ల రామయ్య

మాజీమంత్రి, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో తెలిసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటకాలాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. తన బాబాయ్‌ను ఎవరు చంపారో జగన్‌కు ముందే తెలిసని తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్లో పోస్టు పెట్టారు. వివేకా హత్య కేసులోని సాక్ష్యాలన్నీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలోనే హత్య జరిగినట్లుగా చూపిస్తున్నా ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు సీబీఐ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Varla Ramaiah comments on Viveka's murder

తాడేపల్లి రాజప్రాసాదం అనుమతి లేకుండా ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ తనను వేధిస్తోందంటూ కోర్టులో పిటిషన్ వేయగలడా అన్నారు. ఆ వ్యవహారంపై ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారుఎందుకు మాట్లాడరన్నారు. వివేకాహత్యకేసులో ఇన్నిసాక్ష్యాలు కళ్లముందుకని పిస్తున్నా, అన్నీ అవినాశ్ రెడ్డి పాత్రను ధృవీకరిస్తున్నా, అతన్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నది జగన్మోహన్ రెడ్డికాదా అని ప్రశ్నించారు. స్టూవర్ట్ పురం దొంగలుపట్టుబడగానే, వారిఇళ్లలోని వారు జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఇతరత్రా విభాగాలకు టెలి గ్రామ్ లుపంపించేవారన్నారు.

బీమ్లా నాయక్ సినిమాపైనా ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. సినిమా పరిశ్రమ ప‌ట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో పేదవాడికి ఉన్న ఏకైక వినోదం సినిమా.. ఆ సినిమా పరిశ్రమను కూడా వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ.. అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూస్తున్నారని విమర్శించారు. భీమ్లానాయక్ సినిమాపై ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను ప్రభుత్వమే సృష్టిస్తే ఎలా అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *