రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే ఏకంగా కోట్ల రూపాయలు పొందండి.. ఎలాగంటే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి భవిష్యత్ కోసం కొంత డబ్బును పోగు చేసుకోవాలని భావిస్తారు. ఇలా డబ్బును పొదుపు చేసుకోవాలనే వారికి ప్రస్తుతం చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదా బ్యాంకు ఖాతాలో నిల్వ చేయడం చేస్తుంటారు. అయితే ఇదంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి సాధ్యపడదు కనుక అలాంటి వారు చిన్న మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ విధంగా చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎంతో ప్రయోజనకరం అని చెప్పవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రతి రోజు కేవలం 20 రూపాయలు SIP చేస్తూ రావడం వల్ల మీరు ఏకంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. అయితే కోట్ల ఆదాయం పొందాలంటే మీరు కాస్త సహనంతో ఉండాల్సి ఉంటుంది.అయితే మీకు 20 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చు కాకపోతే ప్రతి రోజు 20 రూపాయల చొప్పున నెలకు 600 రూపాయలు మీరు వెనక వేసుకుంటారు.

ఒక్కసారి ఈ మ్యూచువల్ ఫండ్స్ కట్టిన తర్వాత తప్పనిసరిగా 40 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. అంటే 480 నెలలు ఆరు వందల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఇలా నలభై సంవత్సరాలుగాను మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం కేవలం రూ.2.8 లక్షలు మాత్రమే అయితే మీరు 40 సంవత్సరాల తర్వాత తీసుకోబోయే మొత్తం మాత్రం 1.8 కోట్లు. అయితే 40 సంవత్సరాలపాటు నిరీక్షణ తరువాత మాత్రమే ఈ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *