నలుగురు కమ్మోళ్లను తిడితే పేరొస్తుందనుకుంటున్నావా.? : బుద్ధా వెంకన్న

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి జనాలు‌ చనిపోతే చంద్రబాబు బాధ్యతగా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారని.. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ఆర్ధిక సాయం చేయడం‌ ఆయన నైజమని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అసెంబ్లీలో మదం ఎక్కి చంద్రబాబు సాయాన్ని కూడా తప్పు పట్టడానికి కొడాలి నానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కమ్మ కులాన్ని టార్గెట్ చేసి దూషిస్తున్నారని విమర్శించారు.

గతంలో టీడీపీలో అందలం ఎక్కించి చంద్రబాబు తప్పు చేశారని, చంద్రబాబు దగ్గర కొడాలి నాని బీఫాం తీసుకుని గెలవలేదా అని ప్రశ్నించారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా కొడాలి నానికి లేదని మండిపడ్డారు. మంత్రి పదవి పోతుందనే భయంతోనే నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పది రోజుల్లో కొడాలి నాని అవినీతి చరిత్ర మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. చంద్రబాబు అంతు‌ చూసే అంత దమ్ముందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగుర్ని తిడితే జగన్ దగ్గర పేరు వస్తుందనుకుంటే పొరపాటేనన్నారు.

డేరా బాబా తరహాలో కొడాలి నాని జైలుకు‌ వెళ్లడం ఖాయమనన్నారు. కొడాలి 840 అంటూ  ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీటు ఇవ్వకపోతే.. గుట్లా ప్యాకెట్లను బస్టాండు, రైల్వేస్టేషన్ లో అమ్ముకునేవాడని, తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దే నైజం కొడాలి నానిదన్నారు. 2014కు ముందు గుట్కాకి కూడా అడుక్కునే నాని, వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మంత్రి అయ్యాక రేషన్ లో పందికొక్కులను తరిమేసి.. ఆయనే పందికొక్కులాగా దోచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిట్టుకుందామా, ‌కొట్టుకుందామా.. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. గుడివాడలో నానిని ఓడించి.. తరిమి కొట్టడం‌ ఖాయమన్నారు. కొడాలి నాని అండ్ కో వాగుడు ఆపాలని హితవు పలికారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *