నారాయణకు బెయిల్ మంజూరు..

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలతో అరెస్టు అయిన మాజీ మంత్రి నారాయణకు బెయల్ మంజూరు అయింది. పోలీసులు విధించిన రిమాండ్ ను చిత్తూరు పట్టణ నాలుగో మేజిస్ట్రేట్ తోసిపుచ్చింది. పోలీసులు మోపిన అభియోగాన్ని మేజిస్ర్టేట్ తోసిపుచ్చింది. నారాయణ న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేశారని, నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరపు న్యాయవాదులు ఆధారాలు చూపించారు. దీంతో వ్యక్తిగత పూచీకత్తుతో నారాయణకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని పేర్కొంది.  నిన్న అరెస్టు అనంతరం హైదరాబాద్ నుండి చిత్తూరుకు తరలించారు.

అనంతరం వైద్య పరీక్షల కోసం నారాయణను ప్రభుత్వాస్పత్రికి తరలించి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు అర్థరాత్రి 1.40కి హాజరుపర్చారు. తెల్లవారు జామున 4.10 నిమిషాలకు వ్యక్తిగత పూచీకత్తుతో నారాయణకు బెయిల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది.  నారాయణ తరపు వాదనలు న్యాయవాదులు జ్యోతిరావు, రామకృష్ణ వినిపించారు. నారాయణ అరెస్ట్ పై చంద్రబాబు రాత్రంతా నిరంతర పర్యవేక్షణ చేశారు. ఉదయం వరకు అడ్వకేట్‌లతో మాట్లాడుతూనే ఉంటూ వచ్చారు. అటు నేతలు, ఇటు న్యాయనిపుణులతో నిరంతర చర్చలు జరిపారు.

బెయిల్ మంజూరు వరకు మానిటర్ చేశారు. రాజధాని అలైన్ మెంట్ కేసులో నారాయణను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని లాయర్లను అప్రమత్తం చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబుకూ నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదులు చెప్తున్నా… ఒకవేళ నోటీసులు ఇస్తే ఉదయం 9 గంటలలోపే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో రాయలసీమకు చెందిన సీఐడీ అధికారుల బృందం పర్యటిస్తోంది. అలైన్ మెంట్ కేసులో మిగతావారి ఆచూకీ కోసం సీఐడీ ప్రయత్నాలు చేస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *