అన్నీ పాస్ అయ్యాను కానీ అదే ప్రాబ్లమ్: రాధేశ్యామ్ డైరెక్టర్

Radha Krishna Kumar: రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ గురించి అందరికీ పరిచయమే. గతంలో అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, సాహసం వంటి పలు సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య ప్రభాస్ తో జత కట్టి రాధే శ్యామ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నాడు.

Radha Krishna Kumar
Radha Krishna Kumar

ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ తన ఫ్యాన్స్ తో కాస్త ఫన్నీ చిట్ చాట్ చేసాడు. నెటిజన్ల ప్రశ్నలకు ఏమాత్రం విసుక్కోకుండా అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. ‘మీరు ప్రభాస్ ను ఏమని పిలుస్తారు’ అని ఓ నెటిజన్ అడగగా సార్ అని పిలుస్తా అని సమాధానం ఇచ్చాడు.

పూజా హెగ్డే ఎలా నటించింది.. ఆ యాక్టింగ్ కి ఎంత రేటింగ్ ఇస్తారని ఓ నేటిజన్ అడగగా.. పూజా హెగ్డే తనకు తానే సాటి అనేలా నటించిందని సమాదానం ఇచ్చాడు. మొత్తం సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి అని మరో నెటిజన్ అడగగా లవ్ అని ఒక్క పదంతో తేల్చేసి వర్ణించాడు. ఇదిలా ఉండగా ఓ నెటిజన్ మీరు సెట్లో ఎంజాయ్ చేసినా రోజు ఏది అని అడగగా.. దానికి ప్రతి రోజు అదే ఆన్సర్ చేశాడు.

చివరిగా అందులో ఒక అక్కతాయి లవ్ ఫెయిల్యూరా? మామ.. నువ్వు ఒకవేళ కాకపోతే ఎంతమందిని పడేసావ్.. టిప్స్ ఏమన్నా ఉంటే ఇవ్వు మామ అని అడిగేసాడు. దీనికి రాధాకృష్ణ సావజ్ రిప్లై ఇచ్చాడు. అన్నీ పాస్ అయిపోయాను అదే ప్రాబ్లం అంటూ కన్ను కొట్టిన ఎమోజి ని షేర్ చేసాడు రాధా కృష్ణ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *