బ్రిటీష్ ముద్దుగుమ్మ తో డేటింగ్ లో ఉన్న హీరో విక్రమ్ కుమారుడు.. వైరల్ ఫోటోలు!

తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి, ఆయనకున్న అభిమానం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈయన వారసుడు ధ్రువ్ విక్రమ్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగులో విడుదలైన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాలో బ్రిటిష్ కు చెందిన నటి బనిత సంధు నటించింది. ఇక ఆ సమయంలోనే బనిత, ధ్రువ్ మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిందని వారిద్దరు డేటింగ్ లో ఉన్నారని బాగా వార్తలు వినిపించాయి.

చాలామంది ఇవన్నీ పుకార్లు అనుకున్నారు. కానీ తాజాగా ధ్రువ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. అక్కడ దిగిన ఫోటోను షేర్ చేస్తూ..

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో డార్కెస్ట్ హోల్డ్ ఆన్ వీ ఆర్ గోయింగ్ హోమ్ అనే పాటను జతచేసి ఆమెకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుందని క్లారిటీ తెచ్చుకున్నారు. కొందరు ఇదంతా నిజమేనా.. నిజంగానే పెళ్లి చేసుకుంటారా లేదా టైం పాసా అని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *