Remedies for Knee Pain: ఈ చిట్కాలు పాటిస్తే మీ మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టినట్టే!

Remedies for Knee Pain: అప్పటి కాలంలో వారు ఎక్కువ పొలం పనులు, కష్టమైన పనులు చేయడం వల్ల వారి వయసు వృద్ధాప్యానికి చేరేసరికి వారిలో మోకాళ్ళ నొప్పులు ఉంటుంటాయి. దానికి కారణం మోకాళ్ళ అరుగుదల పెరగడం. కానీ ఇటీవల కాలంలో చిన్న వయసులోనే చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ మధ్య కాలంలో పెరిగిన అనారోగ్య సమస్యలకు టాబ్లెట్ లు ఎక్కువగా మింగడం వల్ల, అంతేకాకుండా కీళ్ల దగ్గర తగినంత జిగురు పదార్థం లేకపోవడం కూడా దీనికి కొంత కారణం అని చెప్పవచ్చు. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులకు దూరంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు మనం తినే వంటల్లో ఉప్పును అధికంగా వాడేవారు ఉంటారు. రుచి కోసం వంటల్లో ఉప్పును ఆలోచించకుండా కలుపుతారు. అలా రుచికోసం చూసుకుంటాం. నిజానికి ఇలా చేయడం మీ కీళ్లకి మీరు హాని చేసినట్టే. ఎందుకంటే ఉప్పు అధికంగా తినడం వలన మోకాళ్లలో కీలు వద్ద జిగురు ఉత్పత్తి అవకుండా చేస్తుంది.

మన శరీరంలో స్వేద లవణాలు పేరుకుపోయి ఉంటాయి. ఈ లవణాలు బయటికి వెళ్లి పోవాలంటే.. ప్రతి రోజు చెమట వచ్చేలా కుదిరినంత పని చేయడం, వ్యాయామం, జిమ్ లాంటివి చేయడం వలన ఈ లవణాలు బయటికి త్వరగా పోయి.. కీళ్ల దగ్గర జిగురు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. ఈ జిగురు ఉండటంవల్ల కీళ్ళ రాపిడి తగ్గించి మోకాళ్ళ నొప్పులు దూరం చేయవచ్చు.

మోకాళ్ళ నొప్పులు కు దూరంగా ఉండాలి అనుకునే వారు.. నిమ్మరసం, విటమిన్ సి ఎక్కువగా ఉండే .. పైనాపిల్, జామకాయ, కివి, స్ట్రాబెర్రీ, మామిడి పండ్లను అరుదుగా వాటి సీజన్ల వారీగా తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా లభించి తద్వారా మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు.

శీతాకాలంలో కొందరు యూరిన్ ఎక్కువగా వస్తుందని నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. మన శరీరానికి నీరు ఎంత అందితే అంత మంచిది. నీళ్లు తక్కువ తాగడం వల్ల శరీరంలో ఉప్పు బయటకు వెళ్ళదు. దీని కారణంగా ఈ కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. అప్పుడు మోకాళ్ళ నొప్పులే కాకుండా శరీరంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *