పొట్టలో ఉన్న కొవ్వు కరగాలి అంటే ఈ పొడిని తీసుకోవాల్సిందే..?

Health Tips: మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఇక బయట దొరికే జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల తొందరగా బెల్లీఫ్యాట్ వచ్చేస్తోంది. ఈ బాధ తో ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. అంతేకాకుండా బయట దొరికే అటువంటి వాటిని తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అది తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి డైలీ నడవడం లాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ చాలామందికి రిజల్ట్ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలామంది మెడికల్ పరంగా వైద్యులు కూడా సంప్రదిస్తున్నారు.

Health Tips
Health Tips

మరి అలాంటి వారికోసం మన ఇంట్లో దొరికే వాటితోనే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకోబోయే చిట్కాను పాటిస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఫిట్ గా కూడా ఉంటుంది. డైలీ ఉదయాన్నే ఈ పొడిని వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదేవిధంగా హెల్దీగా కూడా ఉంటారు. మరి ఆ పొడి కి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, నువ్వులు, దాల్చిన చెక్క, కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ అనేవి మార్కెట్ లో బాగా దొరుకుతాయి. పైన తీసుకున్న నాలుగు పదార్థాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో సమర్థవంతంగా పని చేయడంతో పాటు శరీర ఆరోగ్యానికి మరియు అవయవాల పనితీరును పని చేయడానికి సమర్థవంతంగా తోడ్పడతాయి.

ఈ నాలుగు పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకుని విడివిడిగా వేయించాలి. ఇక అనంతరం నాలుగు పదార్థాలు దోరగా వేయించిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న ఆ పొడి దాదాపు రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది. అర టీ స్పూన్ పొడిలో తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి శరీరం మంచి షేప్ కు వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యానికి మరియు అవయవాల పనితీరు కి ఈ పొడి బాగా సహాయపడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *