నిబంధనలతో కరోనా అంతం అవుతుందా..? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి..?

corona: కరోనా.. గత రెండు సంవత్సరాల నుంచి ప్రజల జీవితాలను అతాలకుతలం చేస్తుంది. కరోనా కంటే ముందు ఎన్నో వ్యాధులు వచ్చాయి.. కానీ ఇంతలా మాత్రం ఏ వ్యాధి ఇబ్బందులు పెట్టలేదు. అంతే కాదు కొన్ని డిసీజ్ లకు శాశ్వతంగా యాంటీ డ్రగ్స్ ను కూడా కనుక్కొన్నారు. అయితే కరోనాకు మాత్రం మెడిసిన్ కనిపెట్టలేకపోయారు. కానీ.. దానికి ప్రత్యామ్నాయంగా.. మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తినిపెంపొందించే విధంగా రెండు వ్యాక్సిన్లను మన దేశం ఇన్వెంట్ చేసింది. అందులో కోవ్యాగ్జిన్ ఒకటి అయితే.. మరొకటి కోవీషీల్డ్ మరొకటి. ఇవి కూడా దాదాపు ఒక డోసు తీసుకున్న తర్వాత మరో డోసు తీసుకోవడానికి రెండు నెలల సమయాన్ని కేటాయించారు. మొదట ఈ వ్యాక్సిన్లపై చాలామందికి అసత్య ప్రచారాలులను నమ్మి.. అపోహలకు గరయ్యి దూరంగా ఉన్నారు. తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకున్న దగ్గర నుంచి ఈ వ్యాక్సిన్ల పంపిణీ వేగంగా జరిగింది. ఆ రోజు నుంచి సామాన్యుడి దగ్గర నుంచి బిజినెస్ మెన్ల వరకు ప్రతీ ఒక్కరూ తీసుకున్నారు. మొదటు 60 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేయగా.. తర్వాత 45 ఏళ్లుపై బడిన వారికి ఇచ్చారు. తర్వాత ప్రతీ వయస్సు వారిని కవర్ చేస్తూ అందరికీ ఇచ్చారు. ఇప్పటికే చాలామంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. ఎలాంటి అపోహలకు గురి కావద్దు అంటూ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రచారాన్ని నిర్వహించింది. అవన్నీ విజయవంతంగా వర్కౌట్ అయినవనే చెప్పాలి.

corona
corona

ఇక కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ ముగిసింది. అందరూ ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం నైట్ కర్ఫ్యూని విధించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. తెలంగాణలో మాత్రం అటువంటి చర్యలు ఏమి తీసుకోలేదు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని.. ఒక వేళ మూతికి మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీనిలో భాగంగానే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో రూల్ ని తీసుకొచ్చింది. బస్సులో ఎవరైనా మాస్క్ లేకుండా ఉంటే.. వారికి రూ.50 ఫైన్ విధించేవిధంగా బస్ కండక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎంతో మందికి ఇలా ఫైన్లకు కూడా విధించారు. ఇదే నియమాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకురానున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇదంతా ఇలా ఉండగా.. మూతికి మాస్క్ లు ధరించినంత మాత్రానా కరోనా కట్టడి అవుతుందా.. కరోనా వ్యాప్తికి నివారణ భౌతిక దూరం, మాస్క్ లు ధరించడమేనా.. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి..? ప్రభుత్వాలు ఆ వైపు ఆలోచనలు చేస్తున్నాయా అంటే.. సమాధానం లేని ప్రశ్న. కేవలం వ్యాక్సిన్లతో ఈ మహమ్మారిని అరికట్టవచ్చా..? ఎన్ని రోజులు అని ఇలా వ్యాక్సిన్ల రూపంలో మనకు మనం కాపాడుకోగలం. రెండు డసులు వేసుకుంటే చాలు అని తెలిపిన ప్రభుత్వాలు.. మళ్లీ బూస్టర్ డోస్ వేసుకోవాలని చెబుతున్నారు. మళ్లీ దాని కోసం వ్యయప్రయాసలు వంచించి.. టైంను కేటాయించాల్సి వస్తుంది. థర్డ్ వేవ్ వచ్చింది కాబట్టి బూస్టర్ డోస్ అన్నారు.. ఇది తగ్గిన తర్వాత పోర్త్ వేవ్ వస్తే.. మళ్లీ మరో బూస్టర్ డోసు వేసుకోవాలా.. అనేది సామాన్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం మెడిసిన్ తీసుకురావాలని.. లేదంటే.. ఈ వ్యాధికి అంతం ఉండదని.. మున్ముందు కరోనా వైరస్ బలపడే అవకాశం ఉంటుందని.. ఇలా అయితే ఏ వ్యాక్సిన్లు పనిచేయవని అంటున్నారు సామాన్యులు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుదో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *