బట్టతల బండారాన్ని బయటపెట్టిన తుపాను… నవ్వులే నవ్వులు..!

తుఫానులు వచ్చేటప్పుడు, రాబోయే ముందు ఈదురు గాలులు చాలా బలంగా వీస్తాయి. మరీ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రభావం కూడా అలానే ఉంటుంది. గాలులు మరీ ఎక్కువగా వీస్తుంటాయి. ఇలా వీచిన గాలులతో ఇంటి పై కప్పులు కొట్టుకుపోతాయి. అల్లకల్లోలంగా ఆ ప్రాంతం అంతా మారుతుంది. తీర ప్రాంతాల్లో అయితే దాని తీవ్రత మరీ బలంగా ఉంటుంది. భారీ నుంచి అతి భారీ చెట్లు నేలకొరుగుతాయి. అంతేగాకుండా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు. విద్యుత్ స్తంబాలు కూడా భారీ గాలులకు నెలకొరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రా, ఒడిశా, బంగాల్ లాంటి ప్రాంతాల్లో సంభవిస్తుంటాయి. ఈ సమయంలో ఎదురయ్యే ఘటనలు చూస్తే కన్నీరు పెట్టక మానరు. అలాంటి ఓ తుఫాను చేసిన ఓ పని చూసిన వారిని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వింస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అనేది ఓ సారి తెలుసుకుందాం.

EUNICE STORM MAKES MAN BALD FORCED TO CHASE WIG FUNNY MOMENT VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA
EUNICE STORM MAKES MAN BALD FORCED TO CHASE WIG FUNNY MOMENT VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA

ఇప్పుడ మనం తెలుసుకోబోయే ఘటన యూకేలో జరిగింది. ఇప్పుడు బ్రిటన్ లో కొంత మేర తుపాను లాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ వర్షాలతో చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ప్రాణ భయంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంటి బయట నిల్చోని ఉన్నారు. అయితే అప్పటికే తుపాను తీవ్రత ఎక్కువగా ఉండడం తో గాలులు కూడా భారీగా వీస్తున్నాయి. ఇదే సమయంలో బయట ఉన్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. గాలి బాగా వీచిన కారణంగా ఆయన తల మీద ఉండే విగ్గు కాస్తా కింద పడిపోయింది. అంతేగాకుండా గాలి ప్రభావం తో అతనికి అందకుండా పక్కకు ఎగురుకుంటా పోయింది.

ఇలా విగ్గు ఎగురుకుంటా పోవడంతో ఆయన కూడా ఆ విగ్గు కోసం పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ ఆ విగ్గు మాత్రం దొరకలేదు. అప్పటికి వరకు ఆయనకు అందరూ మంచిగా జుత్తు ఉంది అని అనుకున్నారు. కానీ తుపాను చేసిన పనికి ఆయన అసలు రూపం బయటపడింది. ఇలా జరిగిందంతా ఓ వ్యక్తి ఇంట్లో నుంచి వీడియో తీస్తున్నాడు. అనంతరం దీనిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్​ చేశాడు. ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరు నవ్వుకోవడం, షేర్​ చేయడం చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *