నిద్రలో ఉన్న కుక్కును లేపిన తాబేలు.. ఒక్క దెబ్బకు..!

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతులకు సంబంధించిన వీడియోలు అయితే మరింత హల్ చల్ చేస్తున్నాయి.  దీంతో వీటిని చూసే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే వైరల్ అవుతున్న ప్రతీ వీడియోలోనూ ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అలాంటి  ఫ్యాక్టరే ఇప్పుడు మీరు చూడబోయే కుక్కు తాబేలు వీడియోలో కూడా ఉంది. ఇంతకీ ఆ వీడియో లో ఏం జరిగింది అనేది ఓ సారి చూద్దాం.

friendship between a tortoise and dog watch funny video
friendship between a tortoise and dog watch funny video

ఓ ఇంట్లో ఒక కుక్క, మరో తాబేలు ఉన్నాయి. ఇవి మంచి మిత్రులుగా ఉండేవి. ఇవి సరదాగా ఆడుకునేవి కూడా. వీటి మధ్య సఖ్యత కూడా అలానే ఉండేది. అయితే ఒక రోజు కుక్కు  మంచి నిద్రలో ఉన్నది. అయితే ఇది సమయం అనుకున్న తాబేలు కుక్కను లేపేందుకు వెళ్లింది. బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుంటూ.. కుక్క కాళ్ల దగ్గరకు వెళ్లింది. కొంత సేపు గీరింది. కాని లేయలేదు.

ఇలా కాదు అని అనుకున్న తాబేలు.. మరి కొంచెం ముందుకు పోయింది. కుక్క మూతి దగ్గరకు అడుగులో అడుగు వేసుకుంటా వెళ్లింది. అప్పటికీ కుక్క లేయలేదు. అంతా గమనించిన తాబేలు తన తను కుక్క నోటి దగ్గరకు తీసుకొని పోయింది. ముక్కు దగ్గర  మరో సారి గీరింది. ఇలా చేయడంతో కుక్కు లేయకుండానే తన కాలిని తీసుకుని బలంగా ఒక్కసారిగా వెనక్కు నెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది.  దీనిని చూసిని వారు కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *