స్టార్‌ హీరోయిన్‌కి ఈడీ షాక్‌.. రూ.7.27 కోట్ల ఆస్తులు జప్తు

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది. జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను అచాట్‌ చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. సుఖేష్‌తో జాక్వలిన్ సన్నిహితంగా దిగిన ఫొటోలు బయటకు రావడం కూడా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

ED attaches ₹7 crore assets of actor Jacqueline Fernandez over conman links

జాక్వలిన్ ఫెర్నాండేజ్‌కు సంబంధించిన రూ. 7.27 కోట్లను అటాచ్ చేసుకున్న ఈడీ అధికారులు .. వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఆమె ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో సేవ్ చేసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌కు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్‌ చేశాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ అరెస్ట్‌ చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌ ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణకు హాజరైంది.

ఇప్పటికే ఈ కేసు కారణంగా పబ్లిక్‌లో రావడనికి ఒకటికి రెండుసార్లు జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆలోచిస్తున్నారు. జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా ‘ఎటాక్’. అందులో జాక్వలిన్ కూడా ఒక రోల్ చేశారు. ఆ సినిమా విడుదల సమయంలో సెలెక్టివ్ గా మీడియా ముందుకు వచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *