ఆర్‌ఆర్‌ఆర్‌: దోస్తీ ఫుల్‌ సాంగ్ వచ్చేసిందోచ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘RRR’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.

Dosti full song out from RRR movie
RRR

కాగా ఈ సినిమాలోని ‘దోస్తీ’ పాట ఫుల్ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ‘ఫ్రెండ్ షిప్’ నేపథ్యంలో గతంలో చాలా హిట్ సాంగ్స్ వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ పాట ఉంటుంది. అల్లూరి సీతారామరాజు.. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ కొమరం భీమ్‌ను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. కానీ అనుకోకుండా వీళ్ళు వేరే విధంగా కలుసుకుని ప్రాణ స్నేహితులు అవ్వడం. ఆ సందర్భానికి అనుగుణంగా వచ్చే పాట ఇది. ఈ పాటలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు అందరినీ ఆకర్షించేలా ఉంది.

విభిన్న ధృవాల మధ్య స్నేహం గురించి వివరించే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా కాలభైరవ ఆలపించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘నాటు నాటు…’, ‘కొమ్మా ఉయ్యాలా…’ పాటల ఫుల్‌ వీడియోలు యూట్యూబ్‌లో కోట్ల వీక్షణలు సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఆలియాభట్‌, ఒలీవియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఇటీవల రూ.1000 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *