గౌరవం అందరికీ ఇవ్వు.. నువ్వు మాత్రమే ఆశించకని అమ్మ చెప్పింది అంటూ నరేష్ కామెంట్!

Vk Naresh : టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతడు నటి విజయనిర్మల కొడుకు అన్న సంగతి మనకు తెలుసు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయంగా కూడా మరో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Vk Naresh
Vk Naresh

ఇదిలా ఉంటే నరేష్ స్థాపించిన విజయ్ కృష్ణ బ్యానర్ ప్రారంభించి యాభై ఏళ్ళు అవుతుంది. దీంతో ఈ బ్యానర్స్ ను మళ్లీ ప్రారంభించాలని అది కూడా ఈ ఏడాది నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానని నటుడు నరేష్ అన్నారు. జనవరి 20.. అనగా ఈరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రోజు నరేష్ విలేకరులతో ఇలా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు.

‘పండంటి కాపురం’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టాను. యాభై సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఇలాంటి సక్సెస్ ఫుల్ జర్నీ కి కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల గార్లకు అలాగే నా గురువు జంధ్యాల కి ధన్యవాదాలు. యాభై ఏళ్ల జర్నీ తర్వాత కూడా కొత్త పాత్రలు ఇస్తున్న రచయితలకు, దర్శక నిర్మాతలకు నన్ను ప్రేమిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని నరేష్ తెలిపాడు.

అంతే కాకుండా “ఈ ఏడాది అమ్మ పేరుతో స్టూడియో ను ప్రారంభిస్తున్నాను. ‘నాలుగు స్తంభాలాట ‘ సినిమా సమయంలో ‘గౌరవం నువ్వు ఆశించకు’ అందరికీ ఇవ్వు అని మా అమ్మ చెప్పింది. నేను అదే ఫాలో అవుతున్న కాబట్టే ఇంకా టాప్ పొజిషన్ లో ఉన్న” అని నరేష్ తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *