పుచ్చకాయ గింజలను మర్చిపోయి కూడా పడేయొద్దు..!

వేసవిలో సమృద్ధిగా లభించే పుచ్చకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎండల ధాటికి డీహైడ్రేషన్ కు గురికాకుండా దీన్ని తింటుంటారు. కానీ, అందులో గుజ్జు తిని.. విత్తనాలను విడిచిపెడతాం. అయితే ఆ విత్తనాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయలోని విత్తనాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే ప్రొటీన్లు, కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, కాపర్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకలను ధృఢంగా మార్చేందుకు సహయం చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

పుచ్చకాయ గింజలలో ఉండే ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు మీ జట్టును బలంగా చేస్తాయి. దీంతో పాటు జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. పుచ్చకాయ విత్తనాలలోని మాంగనీస్ జుట్టు రాలడం సహా డ్యామేజింగ్ జుట్టును క్యూర్ చేస్తుంది పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి పుష్కలంగా ఉండటం వల్ల మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పుచ్చకాయ విత్తనాలతో తీసిన నూనెతో మొటిమలు, వృద్ధాప్య ప్రారంభ సంకేతాల చికిత్సతో పాటు వివిధ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది మీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ గింజలు మీ డల్, డ్రై స్కిన్‌కి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.మీరు పుచ్చకాయ గింజలను పచ్చిగా, మొలకెత్తిన, వేయించి తినవచ్చు. ఈ విత్తనాలు ఏ రూపంలో ఉన్నా చాలా రుచికరంగా ఉండడం సహా ఆరోగ్యంగానూ ఉంటాయి. పుచ్చకాయ గింజలు సాధారణంగా మొలకెత్తిన తర్వాత పోషకాలు అధికంగా లభిస్తాయి. కేవలం ఒక కప్పు పుచ్చకాయ గింజలు మీ రోజువారీ అవసరాలలో 140% కంటే ఎక్కువ మెగ్నీషియంను అందించగలవు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *