షుగర్ తో పాటు బీపీ ఉందా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఎన్నోరకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోని రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారిలో బిపి కూడా సాధారణ స్థితిలో ఉండకుండా బి.పి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది.ఈ విధంగా షుగర్ తో పాటు బీపీ ఉన్నవారు వారి ఆహార విషయంలో జీవనవిధానంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

సాధారణంగా డయాబెటిస్ వ్యాధి బారినపడినప్పుడు కొంతకాలానికి మన శరీరంలోని చిన్న చిన్న రక్త కణాలు దెబ్బతింటాయి. అలాగే రక్తనాళాల గోడలు స్టిఫ్ గా మారడం వల్ల బిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా షుగర్ తో పాటు హైబీపీ ఉండటం వల్ల ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే రెటినోపతి, కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిలో బీపీ తక్కువ అయిన స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.

కనుక షుగర్ తో బాధపడేవారు నిత్యం వారి షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటూ ఉండడమే కాకుండా బిపి మానిటర్ చేయించుకుంటూ ఉండాలి. ఇవి రెండూ సాధారణ స్థితిలో ఉండడం కోసం మన జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం శరీర వ్యాయామాలు చేయడం వంటి వాటిని చేస్తూ షుగర్ లెవెల్స్ బిపి సాధారణ స్థితిలో ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *