తోకతో గిటారు వాయిస్తున్న కుక్క.. ఎలాగంటే..?
ఇన్ స్టాగ్రామ్ వచ్చిన నాటి నుంచి చాలా వెరైటీ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి రెండు కాదు లక్షల సంఖ్యలో వీడియో బయటకు వచ్చాయి. ప్రతీ దానిలో ఏదో తెలియని కొంత భిన్నమైన పనులు ఉంటున్నాయి. దీనితో ఆ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. దీంతో లక్షల కొలద వ్యూవ్సూ వస్తున్నాయి. వేల కొలది కామెంట్లు కూడా వస్తున్నాయి. దీంతో చాలా వరకు వైరల్ వీడియోలు ప్రజలను ఆకట్టుకోవడం తో ఎక్కువ మంది జనాలు వీటిని చేసేందుకు కూడా వెనకాడడం లేదు.
ఇలా ఓ వ్యక్తి తీసిని ఓ శునకం వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కేవలం ఓ కుక్క వీడియో పెడితే ఎవరు అయినా ఎందుకు చూస్తారు.. ఎందుకు వైరల్ అవుతుంది.. ఇందులో కూడా ఓ వింత ఘటన ఉంది. అది ఏంటి అంటే కుక్కలు ఎప్పుడు అయినా సంగీతం వినిపించడం చూశారా… లేదు కదా.. ఈ వీడియోలో మాత్రం ఓ కుక్క సంగీతం వినిపిస్తుంది. ఎలా అని డౌట్ వస్తుంది కదా.. అది మీరే చూసేయండి. కింద ఇచ్చిన లింక్ లో కుక్క చేసిన పని చూడండి.
చూశారుగా అలా ఆ కుక్క తన తొకతో గిటారును వాయిస్తుంది. ఇలా వచ్చే సంగీతాన్ని మనకు వినిపిస్తుంది. సరిగ్గా దీనినే ఆ కుక్క యజమాని క్యాచ్ చేసి వీడియోను అప్లోడ్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. ఎంతో నైపుణ్యం ఉన్నట్లుగా ఆ కుక్క గిటారు వాయించడం చూసిన చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు. అందుకే వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఓ రేంజ్ లో షేర్లు చేస్తున్నారు.